బోల్తాపడిన ఆర్‌టిసి సూపర్ లగ్జరీ బస్సు

అమరావతి: ఆర్‌టిసి సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రిలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కొత్తగూడెం నుంచి బెల్లంపల్లికి వెళ్తున్న ఆర్‌టిసి బస్సు మందమర్రికి చేరుకోగానే బోల్తాపడింది. డ్రైవర్‌తో ఒక ప్రయాణికుడు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బస్సులో ఒక్క ప్రయాణికుడే ఉండడంతో ప్రాణ నష్టం తప్పింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Listings
News
Home
Jobs
Contact