ఇద్దరు అందులకు చూపినిచ్చిన జనహిత సేవా సమితి మన తెలంగాణ / బెల్లంపల్లి టౌన్ : తాను మరణించినా ఇద్దరు అందులకు వెలుగునిచ్చిన వర్షిత కుటుంబాన్ని జనహిత సేవా సమితి అభినందించారు. బెల్లంపల్లి పట్టణం సుభాష్ నగర్ బస్తీకి చెందిన లింగంపెల్లి వర్షిత (12) ఆత్మహత్య చేసుకుంది. మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రమేష్‌లు వారి కుటుంబ సభ్యులను కలిసి వర్షిత నేత్రాలను నేత్రదానం చేయడానికి సభ్యులను ఒప్పించారు. కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో ఉండి ఇద్దరు అంధులకు జీవితంలో వెలుగులు నింపిన వర్షిత కుటుంబాన్ని పలువురు నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షులు ఆడెపు సతీష్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వాతి రమేష్‌లు మాట్లాడుతూ… సమాజహితం కోరి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు వారి కూతురు నేత్రాలను దారం చేయడం సంతోషకరమన్నారు. జనహిత సేవా సమితి తరుపున ఇప్పటి వరకు 12 నేత్ర దానాల కార్యక్రమాలు నిర్వహించారు. వారి కుటుంబ స్ఫూర్తితో ప్రజలందరు మరణించిన తర్వాత అవయవాలను దానం చేసి సమాజానిక ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్రతీ ఒక్కరు ముందుకు రావాలని వారు కోరారు.
