బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడింది. దావ స్వాతి చైర్మన్ గా, రాగంశెట్టి సత్యనారాయణ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. 7వ వార్డు కౌన్సిలర్ దావ స్వాతి చైర్ పర్సన్ గా పీఠం దక్కించుకున్నారు. అలాగే 17వ వార్డు కౌన్సిలర్ రాగంశెట్టి సత్యనారాయణ వైస్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ ఖారురు చేసింది. బెల్లంపల్లి లో 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా ఇండిపెండెంట్ 4, బిజెపి 1, కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించగా ఫోరం 19 స్థానాలతో చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుంది. ఈ ప్రమాణస్వీకారాలను సబ్ కలెక్టర్ మనోజ్ , ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకట స్వామి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం నిర్వహించారు.
ఓట్ల లెక్కింపు రోజే గెలుపొందిన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ క్యాంపు తరలించింది. క్యాంపును మహారాష్ట్రకు తరలించగా మూడు రోజులు అనంతరం ఈరోజు బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు చేరుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ 14 సీట్లతో క్యాంపుకు వెళ్లిన ఇండిపెండెంట్ కౌన్సిలర్లను బుజ్జగింపుల్లో సఫలంకాకపోవడంతో ప్రస్తుతం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకోలేకపోయారు.
