తాండూర్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

తాండూర్, జూన్ 21 : అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఆదివారం మంచిర్యాల జిల్లా తాండూర్‌ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మాదారం పోలీస్ స్టేషన్ గ్రౌండ్‌లో తాండూర్ మండల వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో, తాండూర్ పీహెచ్‌సీ ఆయష్ దవాఖానలో డాక్టర్ సౌజన్య ఆధ్వర్యంలో సామూహిక యోగా సాధన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాయామాలు, ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం వాటి ప్రయోజనాలు గురించి యోగా శిక్షకులు, పీఈటీ తొగరి శ్రీనివాస్, ఉప్పుట్ల చందు అవగాహన కల్పించి కొన్ని ముఖ్యమైన ఆసనాలను కార్యక్రమానికి హాజరైన వారితో వేయించారు.

యోగా సాదనతో అనేక శారీరక రుగ్మతలు దూరం కావడంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. నిత్యం యోగా సాధనతో మన శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పని చేసి వ్యాదులను దూరం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తాండూర్ మండల వాకర్స్ క్లబ్ సభ్యులు, యోగా సాధకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Listings
News
Home
Jobs
Contact