ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్.. డ్యూటీలో మొబైల్ వాడకంపై నిషేధం!
తెలంగాణలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు వ్యక్తిగత మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించేందుకు ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, అత్యవసర సమయాల్లో స్పందించడంలో విఫలమవుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇకపై అధికారిక సమాచార మార్పిడికి వీహెచ్‌ఎఫ్ (VHF) సెట్లను మాత్రమే ఉపయోగించాలని అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ కొత్త నిబంధన అమలులోకి వస్తే ట్రాఫిక్ పోలీసుల పనితీరు మెరుగుపడుతుందని భావిస్తున్నారు.






