Politics

screenshot 2026 07 25 220543
Politics

స్థానిక సంస్థల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు

మంచిర్యాల జిల్లాలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు పనులకు నిధులు కేటాయించింది. తాగునీటి సౌకర్యాలు, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా పరిపాలన వెల్లడించింది.

2125322 hastham picsart aiimageenhancer
Politics

మంచిర్యాల కార్పోరేషన్ హస్తందే

మంచిర్యాల మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో అత్యధిక కార్పోరేట్ స్ధానాలను హస్తగతం చేసుకుని కాంగ్రెస్ విజయ దుందుబి మోగించింది. మున్సిపాలిటి నుంచి కార్పోరేషన్‌గా ఏర్పడిన 60 డివిజన్ స్దానాల్లో 44 స్దానాల్లో కాంగ్రెస్ అభ్యర్దులు ఘన విజయం సాధించారు.బిఆర్‌ఎస్ 08,బిజెపి05, ఆల్‌ఇండియా ఫార్పర్డ్ బ్లాక్ పార్టీ నుంచి 02, జన సేన పార్టీ01లు గెలుపొందారు. శుక్రవారం ముల్కల్ల ఐజా ఇంజనీరింగ్ కళశాలలో నిర్వహించిన ఓట్ల లెక్కింపు ఫలితాలు పోటి చేసిన అభ్యర్దులకు గెలుపు ఓటములపై టెన్షన్ నెలకొంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచి ప్రతి రౌండ్‌లో వచ్చే ఓట్ల ఫలితాలు ఆందోళన కల్గించాయి. డివిజన్‌లోని 60 స్దానాల్లో కాంగ్రెస్,బిఆర్‌ఎస్,బిజెపి, ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీ తో పాటు జనసేన పార్టీ నుంచి అభ్యర్దులు ఎన్నికల బరిలో పోటి చేశారు. కార్పోరేషన్ ఎన్నికల్లో 60 స్దానాల్లో 44 డివిజన్‌లలో కార్పోరేటర్‌లుగా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన వారు వీరే…..01,02,03 డివిజన్‌ల నుంచి శ్రీపతి కవిత శ్రీనివాస్,పుట్ట యశోద, పత్తి ప్రకృతి,07వ డివిజన్ వేల్పుల రవీందర్,09,10,11 డివిజన్‌లలో సురిమెళ్ల సౌమ్య, రాజకొండ గోపాల్, సుధమల్ల హరికృష్ణ,14,15,16,17,18,19,20,21,22 డివిజన్‌ల నుంచి తూముల నరేష్, చింతపండు శ్రీనివాస్, బియ్యాల త్రివేణి, లగిశెట్టి రాజయ్య, రాచమల్ల కమల, కాకుల వరలక్ష్మి, గంగవరపు వెంకటేశ్వర్లు, జోగుల సదానందం,రోజ కంకణాల,24వ డివిజన్ నుంచి బొడ్డు స్వప్న,29,30,31,32,33 డివిజన్‌లలో బండారి సుధాకర్,కర్రె శ్రీనివాస్,తాళ్ల సంపత్,ధరణి మధుకర్, ఎంబడి కుమార స్వామి,35,36,37,38,39,40,41,42,43,44వ డివిజన్‌ల నుంచి మర్రి శ్రీలత,అగల్ డ్యూటీ రాణి,మహమ్మద్ ఖలీద్,పూదరి విజయ, పూదరి సునీత,ఆది శశికళ,షేర్ శ్రీలక్ష్మి,చిందం సత్యవతి,చిలువేరు జ్యోతి,కోమాకుల కిషన్,46వ డివిజన్ నుంచి పెంట రజిత,48వ డివిజన్ నుంచి వేములపల్లి లక్ష్మీదుర్గ, 51,52,53,54,55,56 డివిజన్‌ల నుంచి నీలి స్వప్న, వీరమనేని స్రవంతి, మహమ్మద్ నూర్జహాన్ బేగం, సల్ల రమ్య, గాండ్ల సత్యమ్మ, నల్ల శంకర్,59,60 డివిజన్‌లలో మాదంశేట్టి సత్యనారాయణ, ఆఫ్రీన్ సుల్తానాలు ఉన్నారు. 04,13,23,28,45,47,49,50 డివిజన్‌లలో గుమ్మడి శ్రీను, వనరాశి నంబయ్య, కర్రు శంకర్, అమృతరాజ్ కుమార్,దోమల సునీత, కల్వల వెంకటసాయకృష్ణ, అబ్దుల్ సత్తార్, పెట్టం స్వరూప బిఆర్‌ఎస్ పార్టీల నుండి గెలుపొందారు. అలాగే 05,06,12,57,58 డివిజన్‌లలో తోటపల్లి రాజేశ్వరి,వనపర్తి కేత, గాజుల ముఖేశ్ గౌడ్, బొట్ల అనితలు బిజెపి నుండి గెలుపొందారు. కాగా ఆల్‌ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి 8 వ డివిజన్ మేకల రమేష్,26 డివిజన్ రవిలు గెలుపొందగా జనసేన పార్టీ నుండి 34వ డివిజన్‌లో పోటి చేసిన సాగర్ గెలుపొందారు.

untitled project
Politics

బెల్లంపల్లి చైర్మన్ గా దావ స్వాతి , వైస్ చైర్మన్ గా సత్యనారాయణ ప్రమాణ స్వీకారం

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడింది. దావ స్వాతి చైర్మన్ గా, రాగంశెట్టి సత్యనారాయణ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. 7వ వార్డు కౌన్సిలర్ దావ స్వాతి చైర్ పర్సన్ గా పీఠం దక్కించుకున్నారు. అలాగే 17వ వార్డు కౌన్సిలర్ రాగంశెట్టి సత్యనారాయణ వైస్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ ఖారురు చేసింది. బెల్లంపల్లి లో 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా ఇండిపెండెంట్ 4, బిజెపి 1, కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించగా ఫోరం 19 స్థానాలతో చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుంది. ఈ ప్రమాణస్వీకారాలను సబ్ కలెక్టర్ మనోజ్ , ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకట స్వామి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం నిర్వహించారు.ఓట్ల లెక్కింపు రోజే గెలుపొందిన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ క్యాంపు తరలించింది. క్యాంపును మహారాష్ట్రకు తరలించగా మూడు రోజులు అనంతరం ఈరోజు బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు చేరుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ 14 సీట్లతో క్యాంపుకు వెళ్లిన ఇండిపెండెంట్ కౌన్సిలర్లను బుజ్జగింపుల్లో సఫలంకాకపోవడంతో ప్రస్తుతం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకోలేకపోయారు.

2148866 brs party
Politics

క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బిఆర్ఎస్ దే

హైదరాబాద్: క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. చైర్మన్ గా బిఆర్ఎస్ అభ్యర్థి గొడిసల సంధ్యారాణిని, వైస్ చైర్మన్ గా సిపిఐ పార్టీకి చెందిన అభ్యర్థి మిట్టపల్లి సరితను బిఆర్ఎస్, సిపిఐ సభ్యులు ఎన్నుకున్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉన్నాయి. 10 వార్డుల్లో బిఆర్‌ఎస్‌, ఏడు వార్డుల్లో కాంగ్రెస్, 4 వార్డుల్లో సిపిఐ అభ్యర్థులు గెలిచారు. బిఆర్‌ఎస్‌-సీపీఐ కూటమికి స్పష్టమైన బలం ఉండడంతో క్యాతనపల్లి మున్సిపాలిటీ పీఠంను కైవసం చేసుకుంది. గతంలో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. చివరకు కోర్టు ఆదేశాలతో ఇవాళ క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికను నిర్వహించారు. దీంతో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఎదురుదెబ్బ తగిలింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో కూడా బిఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. మున్సిపల్ చైర్మన్‌గా బిఆర్ఎస్ అభ్యర్థి టేకుల సుదర్శన్ ఎన్నికయ్యారు.

adilabad3 10 v jpg 816x480 4g
Politics

కాంగ్రెస్‌ రైతు వ్యతిరేకి

ఎన్నికల సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్‌ రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. శనివారం బెల్లంపల్లి ఏఎంసీ ఏరియాలోని బీఆర్‌ఎస్‌ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న యూరియా యాప్‌ను ప్రభు త్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. యూరియా యాప్‌ను వెంటనే ఎత్తివేయాలి హస్తం నాయకులు రైతులను దోచి దళారులకు పెడుతున్నరు బీఆర్‌ఎస్‌ హయాంలో అన్నదాతలకు మేలు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇటీవల నిరసనలో పాల్గొన్న కర్షకులపై కేసులు నమోదు చయడంపై ఆగ్రహం బెల్లంపల్లి, జూన్‌ 20 : ఎన్నికల సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్‌ రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. శనివారం బెల్లంపల్లి ఏఎంసీ ఏరియాలోని బీఆర్‌ఎస్‌ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న యూరియా యాప్‌ను ప్రభు త్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. యాప్‌తో రైతులకు యూరియా బస్తాలు లభించకపోగా, వాటి కోసం నానా అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కౌలు రైతులకు ఈ యాప్‌తో సంబంధం లేకపోవడంతో వారికి యూరియా లభించడం లేదన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే యూరియా యాప్‌ను ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల్లో దొరకని యూరియా కాంగ్రెస్‌ పార్టీ దళారుల ఇండ్లలో లభ్యమవుతున్నాయని మండి పడ్డారు. కాసిపేట మండలంలో ఇటీవల ఓ నాయకుడి ఇంట్లో యూరియా బస్తాలు పట్టుబడ్డాయని గుర్తు చేశారు. ఒక్కో బస్తాకు రూ. 100 అదనంగా తీసుకుని విక్రయించుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళారులకు దోచిపెట్టి రైతుల నడ్డి విరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో రైతుబంధు ఎకరాకు రూ. 10 వేలు ఇచ్చిందని, కాంగ్రెస్‌ సర్కారు ఎకరాకు రూ. 15 వేలు, రెండు పంటలకు కాకుండా మూడు పంటలకు ఇస్తామని గొప్పలకు పోయిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేసిందని ఆరోపించారు. కేసీఆర్‌ హయాంలో 24 గంటల విద్యుత్‌ను అందించగా ప్రస్తుతం ఐదు, ఆరు గంటలు మాత్రమే వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా చేస్తున్నారని మండి పడ్డారు. కరోనా కష్టకాలాన్ని కూడా లెక్కచేయకుండా తెలంగాణ తొలి ము ఖ్యమంత్రి ఏడు వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు కొండంత అండగా నిలవగా, ప్రస్తుతం సరైన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక, గిట్టుబాటు ధర కల్పించక రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. నిరసనలో పాల్గొన్న రైతులపై కేసులా?నెన్నెల మండలం గొల్లపల్లిలో ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన వ్యక్తం చేసిన రైతులపై పోలీసులు కేసులు నమోదు చేయడమేమిటని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రశ్నించారు. రైతులపై అన్యాయంగా కేసులు నమోదు చేసిన ఘటన దేశంలో ఎక్కడా లేదని ఎద్దేవా చేశారు. పోలీసులు, అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిరసనలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారని, వారిపై కేసులు నమోదు చేశామని పోలీసులు పేర్కొనడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకుల ఆదేశాల మేరకే రైతులపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రైతులు కాదా అని ప్రశ్నించారు. పోలీసు అధికారులు మొబైల్‌ ఫోన్లు పరిశీలిస్తే ఎవరి ప్రోధ్భలంతో కేసులు నమోదు చేశారో తేటతెల్లమవుతుందని తెలిపారు. రాబోయేది రైతు పక్షపాత కేసీఆర్‌ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం చైర్‌పర్సన్‌లను నామినేటెడ్‌ పద్ధతిలో నియామకం చేయడమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలకు లబ్ధి చేకూర్చడానికే నామినేటెడ్‌ పద్ధతిని అమలు చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది సీఎంలు పాలించారని, ఇలా నియామకం చేయలేదని వివరించారు. జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ తొంగల సత్యనారాయణ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సుదర్శన్‌, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు సంతోశ్‌ కుమార్‌, అరుణ్‌కుమార్‌, సుందర్‌రావు, నిరంజన్‌ పాల్గొన్నారు.

Listings
News
Home
Jobs
Contact