Agriculture

ag3
Agriculture

రైతు వేదికల్లో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణ

మంచిర్యాల జిల్లా రైతు వేదికల్లో ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నీటి పొదుపు, సేంద్రియ ఎరువుల వినియోగం, నేల పరీక్షలు, డ్రిప్ ఇరిగేషన్, యాంత్రీకరణ వంటి అంశాలపై రైతులకు నిపుణులు మార్గదర్శకత్వం అందిస్తున్నారు. ఈ శిక్షణల ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశాలు పెరుగుతున్నాయి.

ag2
Agriculture

పత్తి పంటలో పురుగుల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం

మంచిర్యాల జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం అధికంగా ఉండటంతో రైతులకు గులాబీ రంగు పురుగు (Pink Bollworm) నివారణపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు ఫెరోమోన్ ట్రాప్స్ వినియోగం, సమగ్ర పురుగు యాజమాన్య పద్ధతులపై సూచనలు అందిస్తున్నారు. అవసరమైనప్పుడు మాత్రమే పురుగుమందులను వినియోగించాలని సూచించారు.

ag1
Agriculture

వరి సాగుకు రైతులు సిద్ధం – నాణ్యమైన విత్తనాల పంపిణీ ప్రారంభం

మంచిర్యాల జిల్లాలో ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖ రైతులకు నాణ్యమైన వరి విత్తనాలను పంపిణీ చేయడం ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల ద్వారా విత్తనాలు అందుబాటులో ఉంచారు. వ్యవసాయ అధికారులు రైతులకు విత్తన శుద్ధి, సమయానుకూలంగా విత్తడం, సమతుల్య ఎరువుల వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ చర్యల ద్వారా అధిక దిగుబడి సాధించాలని అధికారులు సూచించారు.

b6287960fc1ee64c09accce4a4c39281
Agriculture

కవ్వాల్ రిజర్వు ఫారెస్టులో 200 చెట్లను నరికిన ఆదివాసీలు

మంచిర్యాల జిల్లా, కవ్వాల్ రిజర్వు ఫారెస్టులోని పాలగోరి ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఇతరులకు అనుమానం రాకుండా జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్ ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు సుమారు 200 వరకు చిన్నా, పెద్ద చెట్లను నరికివేశారు. చెట్లను విచ్చలవిడిగా నరుకుతున్నట్లు సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది నరికివేతను అడ్డుకోవడంతో ఆదివాసీలు అటవీ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు ఇందన్‌పల్లి రేంజ్ ఆఫీసర్ శ్రీధరాచారి తెలిపారు. చెట్లను నరికివేయకుండా ఎప్పటికప్పుడు రాత్రి, పడలు అనే తేడా లేకుండా తమ సిబ్బంది […] మంచిర్యాల జిల్లా, కవ్వాల్ రిజర్వు ఫారెస్టులోని పాలగోరి ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఇతరులకు అనుమానం రాకుండా జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్ ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు సుమారు 200 వరకు చిన్నా, పెద్ద చెట్లను నరికివేశారు. చెట్లను విచ్చలవిడిగా నరుకుతున్నట్లు సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది నరికివేతను అడ్డుకోవడంతో ఆదివాసీలు అటవీ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు ఇందన్‌పల్లి రేంజ్ ఆఫీసర్ శ్రీధరాచారి తెలిపారు. చెట్లను నరికివేయకుండా ఎప్పటికప్పుడు రాత్రి, పడలు అనే తేడా లేకుండా తమ సిబ్బంది అక్కడే మకాం వేసి ఉండడంతో వారి కండ్లు కప్పి మూకుమ్మడిగా చెట్లను నరికివేశారని తెలిపారు. నరికివేతను అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని, తమ సిబ్బందిని ఆదివాసీలు బెదిరించారని తెలిపారు.చెట్లను నరికివేసిన 50 మంది ఆదివాసీలపై అటవీ యాక్టు ప్రకారం కేసు నమోదు చేశామని, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సైతం 50 మందిపై ఫిర్యాదు చేశామని తెలిపారు. కాగా, కవ్వాల్ డిఆర్‌ఒ విజయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివాసీలపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ అనూష తెలిపారు. చెట్లను నరికివేసిన ప్రాంతాన్ని సాయంత్రం లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్‌ఐ తహసోద్దీన్‌‚ సందర్శించారు. అనవసరంగా అడవిలోకి ప్రవేశించి చెట్లను నరికివేయడం తగదని, ఇప్పటికైనా మానుకోవాలని, లేకుంటే చూస్తూ ఊరుకోబోమని సిఐ హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని కాని చెట్లను నరికివేయడం తగదని అన్నారు.

cyclone amphan impact
Agriculture

అకాల వర్షం.. అన్నదాతలు ఆగమాగం

రెండు రోజులుగా వేసవి ఎండ రుచి చూసిన ప్రజలు సోమవారం ఒక్క సారిగా మారినఅకాల వర్షం.. అన్నదాతలు ఆగమాగమయ్యారు. సోమవారం మద్యాహ్నాం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చేసుకొని భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలలతో భారీ వర్షం కురవడంతో జిల్లా తడిచి ముద్దయ్యింది. కురిసిన అకాల వర్షంతో మామిడి చెట్లకు ఉన్న పూత రాలి పోయింది. అలాగే మండలంలో తెల్లబంగారం పండించిన రైతులకు ఇంకా కొందరు పత్తిని చెట్టు మీద నుండి తెంపక పోవడంతో సోమవారం కురిసిన అకాల వర్షానికి తడిచిపోయి రైతులకు నష్టాన్ని చవి చూపించింది.

2129467 it park land acquisition picsart aiimageenhancer
Agriculture

ఐటి పార్క్ భూసేకరణలో రైతుకు అన్యాయం

మంచిర్యాల జిల్లా హాజిపూర్ మండలంలోని వేంపల్లి లో ఐటి పార్కు భూసేకరణలో తీవ్ర అన్యాయం జరిగిందని మాడుగుల నర్సయ్య అనే రైతు సోమవారం జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు.తమ వద్ద వాస్తవంగా (మోక ప్రకారం)ఐదు ఎకరాలకు పైగా భూమి ఉన్నప్పటికి అధికారుల నిర్లక్షంతో కేవలం ఒక ఎకరానికి మాత్రమే నష్టపరిహారం చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. వేంపల్లి గ్రామ రెవెన్యూ శివారు సర్వే నెం:159/37లో తమ కుటుంబం సంవత్సరాలుగా నిరంతరంగా భూమిని సాగు చేస్తోందని,వాస్తవ స్వాధీనంలో ఉన్న మొత్తం విస్తీర్ణం 5ఎకరాలు ౦౨ గుంటలుగా ఉందని తెలిపారు. కాగా పాస్‌బుక్‌లో ఒక్క ఎకరం ౦౧ గుంట మాత్రమే నమోదై ఉండటాన్ని కారణంగా చూపి, మిగతా భూమికి నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు చేతులు దులుపుకున్నారని తెలిపారు. భూసేకరణకు సంబందించి నోటిఫికేషన్ తమకు వ్యక్తిగతంగా అందలేదని, గ్రామ స్దాయిలో కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు.కేవలం పత్రిక ప్రకటనకే పరిమితం కావడంతో అభ్యంతరాలు తెలిపే అవకాశం కోల్పోయామని తెలిపారు. ప్రాధమిక విచారణ నివేదికలో కూడా వాస్తవ స్తితిని పక్కన పెట్టి యాంత్రికంగా ఒక ఎకరం మాత్రమే చూపడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే భూసేకరణలో తమ లాంటి పరిస్దితిలో ఉన్న ఇతర రైతులకు మోకా ఆధారంగా పూర్తి నష్టపరిహారం చెల్లించగా, తన విషయంలో మాత్రం వివక్ష చూపారని ఆరోపించారు. భూసేకరణకు కాన్సెంట్ అవార్డు పేరిట జరిగిందని చెప్తున్నా తన నుంచి స్వచ్చంద సమ్మతి తీసుకోలేదని ఒత్తిడితో సంతకాలు సేకరించారని ఆరోపించారు. మిగిలిన భూమికి కూడా నష్టపరిహారం చెల్లించాలని లేనిపక్షంలో స్పష్టమైన కారణాలతో రాతపూర్వక ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు బాధిత రైతు నర్సయ్య తెలిపారు. ఈ విషయంపై జిల్లా స్దాయిలో స్వతంత్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు.

2136521 market picsart aiimageenhancer
Agriculture

చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా మహేశ్‌ ప్రసాద్ ప్రమాణ స్వీకారం

మంచిర్యాల జిల్లా, చెన్నూరు: చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా మహేశ్ ప్రసాద్ తివారీ ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి హాజరయ్యారు. మార్కెట్ కమిటీ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మహేశ్ ప్రసాద్ తివారీతో పాటు కమిటీ సభ్యులు కూడా పదవీ ప్రమాణం చేశారు. కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కొత్తగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్ మరియు సభ్యులకు అభినందనలు తెలిపారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేలా మార్కెట్ కమిటీ పని చేయాలని సూచించారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కొత్త చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది.

Listings
News
Home
Jobs
Contact