Latest News

6c5a72ae57cc540b2951dce8fb626e84
Latest News

ఎయిర్‌పోర్టులను తలపించేలా రైల్వేస్టేషన్ల అభివృద్ధి: బండి సంజయ్‌

మంచిర్యాలలో రూ.26 కోట్లతో అమృత్ భారత్ పనులు రూ.3.50 కోట్లతో పుట్‌ఓవర్ బ్రిడ్జి పనులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ వెల్లడి మంచిర్యాలలో వందే భారత్ రైలు స్టాపేజీ ప్రారంభం మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధిః కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టులను తలపించేలా రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేపడుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. సోమవారం మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో వందే భారత్ 20101 నాగ్‌పూర్-సికింద్రాబాద్ రైలు స్టాపేజీని రాష్ట్ర […]మంచిర్యాలలో రూ.26 కోట్లతో అమృత్ భారత్ పనులు రూ.3.50 కోట్లతో పుట్‌ఓవర్ బ్రిడ్జి పనులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ వెల్లడి మంచిర్యాలలో వందే భారత్ రైలు స్టాపేజీ ప్రారంభం మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధిః కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టులను తలపించేలా రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేపడుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. సోమవారం మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో వందే భారత్ 20101 నాగ్‌పూర్-సికింద్రాబాద్ రైలు స్టాపేజీని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్, శాశన మండలి సభ్యుడు అంజిరెడ్డి, డిఆర్‌ఎం గోపాలకృష్ణన్, రఘు, ముఖ్య ప్రజా సంబందాల అధికారి శ్రీధర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.

2098483 panchayat secretary in acb picsart aiimageenhancer (1)
Latest News

ఎసిబి వలలో పంచాయతీ కార్యదర్శి

మంచిర్యాల జిల్లా, కన్నెపల్లి మండలం, పంచాయతీ కార్యదర్శి గొర్లపల్లి రాజ్ కుమార్ ఎసిబికి చిక్కాడు. వివరాల్లోకెళ్తే ..కన్నేపెల్లి పంచాయతీకి చెందిన ఓ లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు బిల్లుల డబ్బులు ఇప్పించేందుకు రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల ప్రకారం.. పంచాయతీ కార్యదర్శికి బెల్లంపల్లిలో డబ్బులు ఇస్తానని చెప్పడంతో అక్కడికి పంచాయతీ కార్యదర్శి వచ్చాడు. బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో బాధితుడు రూ.5 వేలు డబ్బులు ఇస్తుండగా ఎసిబి డిఎస్‌పి మధు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

2140703 varshitha donor eyes picsart aiimageenhancer
Latest News

క్షణికావేశంలో ఆత్మహత్య… ఇద్దరికి వెలుగునిచ్చిన వర్షితా

ఇద్దరు అందులకు చూపినిచ్చిన జనహిత సేవా సమితి మన తెలంగాణ / బెల్లంపల్లి టౌన్ : తాను మరణించినా ఇద్దరు అందులకు వెలుగునిచ్చిన వర్షిత కుటుంబాన్ని జనహిత సేవా సమితి అభినందించారు. బెల్లంపల్లి పట్టణం సుభాష్ నగర్ బస్తీకి చెందిన లింగంపెల్లి వర్షిత (12) ఆత్మహత్య చేసుకుంది. మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రమేష్‌లు వారి కుటుంబ సభ్యులను కలిసి వర్షిత నేత్రాలను నేత్రదానం చేయడానికి సభ్యులను ఒప్పించారు. కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో ఉండి ఇద్దరు అంధులకు జీవితంలో వెలుగులు నింపిన వర్షిత కుటుంబాన్ని పలువురు నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షులు ఆడెపు సతీష్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వాతి రమేష్‌లు మాట్లాడుతూ… సమాజహితం కోరి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు వారి కూతురు నేత్రాలను దారం చేయడం సంతోషకరమన్నారు. జనహిత సేవా సమితి తరుపున ఇప్పటి వరకు 12 నేత్ర దానాల కార్యక్రమాలు నిర్వహించారు. వారి కుటుంబ స్ఫూర్తితో ప్రజలందరు మరణించిన తర్వాత అవయవాలను దానం చేసి సమాజానిక ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్రతీ ఒక్కరు ముందుకు రావాలని వారు కోరారు.

mag1
Latest News

దవాఖానలో అన్నపూర్ణ

పట్నంలో వైద్యం చేయించాలంటే రోగితోపాటు వచ్చే సహాయకులు తిండికి తిప్పలు పడాల్సిందే! ఇక్కడి ఖర్చులకు జేబులు ఖాళీ అవుతాయన్న సంగతీ అనుభవమున్నవారికి తెలుసు. అలాంటి వారికి ఆశ్రయం కల్పిస్తుంది ‘జనహిత సేవా ట్రస్ట్‌’. గాంధీ దవాఖానకొచ్చే రోగి బంధువులకు ఆశ్రయం కల్పించి, మూడు పూటలా తిండి పెడుతూ వారి ఆకలి తీర్చే అన్నపూర్ణ ఇది. మానసిక పిల్లలకు విద్యను నేర్పుతూ గొప్ప పంతులమ్మగా మారింది.పట్నంలో వైద్యం చేయించాలంటే రోగితోపాటు వచ్చే సహాయకులు తిండికి తిప్పలు పడాల్సిందే! ఇక్కడి ఖర్చులకు జేబులు ఖాళీ అవుతాయన్న సంగతీ అనుభవమున్నవారికి తెలుసు. అలాంటి వారికి ఆశ్రయం కల్పిస్తుంది ‘జనహిత సేవా ట్రస్ట్‌’. గాంధీ దవాఖానకొచ్చే రోగి బంధువులకు ఆశ్రయం కల్పించి, మూడు పూటలా తిండి పెడుతూ వారి ఆకలి తీర్చే అన్నపూర్ణ ఇది. మానసిక పిల్లలకు విద్యను నేర్పుతూ గొప్ప పంతులమ్మగా మారింది. పదమూడేండ్లుగా నిరంతరం సేవా మార్గంలో పయనిస్తున్న ‘జనహిత’ విశేషాలను ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నర్సింహమూర్తి సోమయాజులు బతుకమ్మతో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…మాది హైదరాబాద్‌. నాన్న రైల్వే ఉద్యోగి కావడం వల్ల హైదరాబాద్‌, వరంగల్‌ ప్రాంతాల్లో నా చదువు సాగింది. ఆ తరువాత హైదరాబాద్‌లోనే ఓ ప్రైవేట్‌ ఉద్యోగంలో చేరాను. సుమారు నలభై సంవత్సరాలు పనిచేశాను. ఉద్యోగంలో భాగంగా తరచూ పర్యటనలు చేసేవాణ్ని. ఆ సమయంలోనే పేదల కష్టాలు నన్ను కదిలించాయి. కనీసం తిండికి కూడా నోచుకోని వారిని చూసి చలించిపోయేవాణ్ని. అలాంటి వాళ్లకోసం నావంతుగా ఏదైనా చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. అలా 2008లో సేవా భారతి స్వచ్ఛంద సంస్థలో చేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించాను. ఆ సమయంలోనే పద్మారావు నగర్‌లోని సేవానంద ఆశ్రమంలో ఉండే స్వామిజీతో పరిచయం ఏర్పడింది. ఆయన రెగ్యులర్‌గా గాంధీ ఆసుపత్రికి వెళ్లి తోచిన సేవ చేస్తుండేవారు. అలా ఒకరోజు ఆయన రోగులకు చద్దర్లు పంపిణీ చేస్తుండగా అక్కడున్న సూపరింటెండెంట్‌ ‘స్వామీజీ మీరు నిత్యం ఎంతోమంది రోగులకు సహాయం చేస్తునే ఉన్నారు. నేను దవాఖాన ప్రాంగణంలో స్థలం ఇస్తాను. అందులో ఓ భవనం కట్టి రోగులతో వచ్చే సహాయకులకు ఆశ్రయం కల్పించండి’ అని అడిగారు. కొన్నాళ్లకు అక్కడ స్వామిజీ భవనం కట్టించారు. దాని కార్యకలాపాలు నన్ను చూసుకోమని చెప్పడంతో కాదనలేక ఒప్పుకొన్నాను.అలా ప్రారంభించాంరోగుల సహాయకులకు ఆశ్రయం కల్పించేందుకు 2013లో గాంధీ దవాఖానలో ఈ షెల్టర్‌ను ప్రారంభించాం. ఒకసారి మధ్యాహ్నం కావొస్తుంది కరీంనగర్‌ నుంచి వచ్చిన ఓ మహిళ తన పిల్లలతో పాటు ఆ షెల్టర్‌లోనే ఉంది. అదేంటమ్మ బయటికెళ్లి తినిరాకుండా ఇక్కడే ఉన్నావని అడిగాను. తన వద్ద డబ్బులేమి లేవందామె. తన భర్త డయాలసిస్‌ కోసమని మారుమూల గ్రామం నుంచి వచ్చామని చెప్పింది. ఆమె మాటల్లోంచి పుట్టిందే మధ్యాహ్న భోజనం. అప్పటినుంచి రోగుల కోసం వచ్చే సహాయకులకు ఉచిత భోజనం అందించాలనే లక్ష్యంతో మా చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టి రోజుకు 50 భోజనాలు పంపిణీ చేసేవాళ్లం. అలా 2014లో పది మంది ఆకలి తీర్చడం కోసం ‘జనహిత సేవా ట్రస్ట్‌’ ఏర్పాటైంది. 2014లో గాంధీ మెడికల్‌ కళాశాల పూర్వ విద్యార్థులు కొంతమంది కలిసి మధ్యాహ్న భోజనానికి అయ్యే ఖర్చులో 75 శాతం సహకరిస్తామని హామీ ఇచ్చి నెలనెలా పంపించడం ప్రారంభించారు. మా సేవలు చూసిన ఓ స్వామిజీ రాత్రిపూట తనే స్వయంగా భోజనం తయారు చేసి పంపించేవారు. ఇలా రోజుకు రెండు పూటలు భోజనం అందిస్తుండగా. ఒకరోజు ఆదిలాబాద్‌కు చెందిన ఓ వృద్ధుడు ఆకలితో ఉదయం 11 గంటలకే షెల్టర్‌లో ఎదురు చూస్తుండటం నన్నెంతో కలిచివేసింది. అలాంటి ఇబ్బంది మరెవరూ పడొద్దని ఉదయం టిఫిన్‌ కూడా ప్రారంభించాం.

screenshot 2026 06 21 174101
Latest News

తాండూర్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

తాండూర్, జూన్ 21 : అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఆదివారం మంచిర్యాల జిల్లా తాండూర్‌ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మాదారం పోలీస్ స్టేషన్ గ్రౌండ్‌లో తాండూర్ మండల వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో, తాండూర్ పీహెచ్‌సీ ఆయష్ దవాఖానలో డాక్టర్ సౌజన్య ఆధ్వర్యంలో సామూహిక యోగా సాధన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాయామాలు, ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం వాటి ప్రయోజనాలు గురించి యోగా శిక్షకులు, పీఈటీ తొగరి శ్రీనివాస్, ఉప్పుట్ల చందు అవగాహన కల్పించి కొన్ని ముఖ్యమైన ఆసనాలను కార్యక్రమానికి హాజరైన వారితో వేయించారు. యోగా సాదనతో అనేక శారీరక రుగ్మతలు దూరం కావడంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. నిత్యం యోగా సాధనతో మన శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పని చేసి వ్యాదులను దూరం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తాండూర్ మండల వాకర్స్ క్లబ్ సభ్యులు, యోగా సాధకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Listings
News
Home
Jobs
Contact